సమయం ఉదయం 7:37....
Bedok Reservoir Road..........
సరిగ్గా Channel News Asiaలో మార్నింగ్ వార్తలు అయిపోయిన 7 నిముషాలకి.....
ఆఫీస్ కెళ్ళే తొందర్లలో ఉన్న ఆ భర్త తన భార్యని లేట్ అయ్యిపోతుంది తినటానికి ఏమైనా పెట్టు అని అడిగాడు...
అప్పుడే స్టవ్ మీద నుండి దింపిన ద్రవానాన్ని గ్లాస్ లో పోసి ఇచ్చిందా భార్యామణి...
తాగటానికి కాదు తినటానికి అని చిరాగ్గా చెప్పాడా భర్త...
కోపంగా ఆ గ్లాసులో ద్రవానాన్ని ప్లేట్లో కుమ్మరించి అతని ముందు పెట్టిందా ఇల్లాలు...
అప్పటికి కానీ అర్ధం కాలేదా అభాగ్యునికి అది ఉప్మా అని...
టైం లేకపోవటంతో ఆ ఉప్మాని స్పూన్ తో ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు....
కాస్త ఉప్పు తగ్గినట్టు అనిపించటంతో అదే మాట తన భార్యతో చెప్పాడు...
అంతే ఆ భార్యామణి ఒక్కసారిగా ఉగ్ర కాళికావాతరం ఎత్తింది....
తన చేతి గోల్లనే ఆయుధాలుగా మలుచుకుంది....
భర్త కుడి చేతిపైన తీవ్రమైన గాయమైంది.....
అతి కష్టంపైన అక్కడనుండి తప్పించుకున్న భర్త బతుకు జీవుడా అంటూ ఆఫీసుకు వెళ్ళాడు...
పెళ్ళైన అభాగ్యులారా బాగో!!!
పెళ్ళికాని ప్రసాదులారా జాగో!!!
Read More