Social Icons

Wednesday, September 5, 2012

జ్ఞాపకం

అలలా ఎగసి పడుతూ ఎదను మీటుతున్న జ్ఞాపకం ...
ఒంటరిగా ఉన్నవాన్ని బందాలలోకి నెట్టిన జ్ఞాపకం ...
స్పష్టత లేదు... స్వరూపం లేదు..ఏ ఆకారం తెలియని నిరాకారపు జ్ఞాపకం ...
ఆయినా నవనాడుల స్పందనకి ఉవ్వెత్తున ..ఉత్తుంగ తరంగంలా ఎగసిపడుతున్న జ్ఞాపకం...
ఆకలి దప్పులని మాన్పించి ..ఆలోచనా తరంగాలవైపు పయనం చేయిస్తున్న జ్ఞాపకం..
స్థానువైన హృదయానికి స్థానచలం కలిగించిన జ్ఞాపకం...
అంతరంగంలో వేస్తున్న తప్పటడుగుల శబ్దాన్ని ..సిరిమువ్వల సవ్వడులుగా మార్చిన జ్ఞాపకం ...
ఆవసాన దశలో ఉన్న ఆత్మీయతానురాగాలను సుగందలేపనాలతో సుచరితం చేసిన జ్ఞాపకం...
మమతలు మరిచి ..మనిషి మహిషిగా మారుతున్నప్పుడు ..మహోన్నత మానవతారీతులను జ్ఞప్తికి తెచ్చిన జ్ఞాపకం...
పాషాణంగా ఉన్నవానికి పాదచలనం కలిగించిన జ్ఞాపకం ....మనిషిని మనిషిగా చూడటం నేర్పిన జ్ఞాపకం...
ఎప్పటకి చెదరని జ్ఞాపకం ...ఎన్నటికి వీడని జ్ఞాపకం ...
తొలిచూపులో ఎదను తాకిన జ్ఞాపకం...
తుదిశ్వాశవరకు చెరగని జ్ఞాపకం...
రెండు అక్షరాల స్పందనకి ...ప్రతిస్పందనని కలిగించిన జ్ఞాపకం...
......ప్రేమ....
అవును.. అది ప్రేమ అనే తీపి జ్ఞాపకం..
ప్రతి హృదయంలో ...ఏదో ఒకనాడు ఏదో ఒకరీతిగ మెదిలే జ్ఞాపకం...
చిరకాలపు తొలకరి జ్ఞాపకం..
ప్రేమ.."

for more refer:
http://madhu-telugukavithalu.blogspot.sg/