Social Icons

Sunday, June 24, 2012

అంతా మనమంచికే



         పూర్వం ఒకరోజు  రాజు గారు మంత్రి గారు కుర్చుని పండ్లు కోసుకుని తినుటు ఉన్నప్పుడు  పొరపాటున రాజు గారి వేలు తెగింది.పక్కనే ఉన్న మంత్రిగారు  అంతా మన మంచికే అన్నారు.రాజుగారికి న వేలు తెగితే వీడు మంచిదే అంటున్నాడు అని కోపం వచ్చింది . మంత్రి కి ఎలా అయినా బుద్ది  చెప్పాలి అని అనుకున్నాడు .

         ఒక రోజు రాజు మంత్రి కలిసి అడవికి వెళ్లారు.రాజు గారు మంత్రిని నుయ్యి లోకి తోసి  అంతా మనమంచికే అన్నాడు.వెనక్కు వెళ్ళబోతూ ఉండగా ఆడవిలోని ఆటవిక జాతి వాళ్ళు కొందరు రాజుని పట్టుకున్నారు. వాళ్ళ కొండ దేవతకి బలి ఇవ్వటానికి తీసుకెళ్ళారు.

        బలి ఇవ్వబోతు ఉండగా అతని తెగిన వేలిని చూసి బలికి పనికిరాదు అని తేల్చి వదిలేసారు.అప్పుడు రాజు గారికి మంత్రి గారి మాటలు గుర్తుకి వచ్చాయి.వెంటనే నుయ్యి దగ్గరకి వెళ్లి మంత్రిని బయటకి తీసాడు.

      అప్పుడు రాజు మంత్రితో నాకు వేలు  తెగి ఇలా మంచి జరిగింది మరి నేను నిన్ను నుయ్యి లోకి తోసాను కదా  నీకు ఏమి మంచి జరిగింది ? అన్నాడు.అప్పుడు మంత్రి నేను మీతో ఉండి ఉంటె మీతోపాటు నన్ను కూడా తీసుకు వెళ్ళేవాళ్ళు.మీరు ఎలాగు బలికి పనికి రారు కాబట్టి మిమ్మల్ని వదిలేసి నన్ను పట్టుకునే వాళ్ళు .మీరు నుయ్యి లో తోసేయ్యాబట్టి బ్రతికి పొయ్యాను అన్నాడు.

     అప్పట్నుంచి అంతా  మనమంచికే అని నానుడి మొదలయ్యింది .


సేకరణ : సాక్షి వీక్లీ నుంచి.