'చెవులు గింగురుమంటున్నాయి.. ఏమిటా అరుపులు..!'
'ఏంటా ఎగురుడు..? బండలు పగిలిపోతాయి..!'
'ఆ పరుగులు ఏమిటి? పడతావు.. మెల్లగా నడవలేవా?'
'ఏమిటా కాయితాలన్నీ అలా చింపిపోయడం...!'
'ఎప్పుడూ అది కావాలి. ఇది కావాలి అంటావు. ఏది పెడితే అదే తినాలి? పేచీలు పెట్టావా..?'
'నిన్నేగా కొన్నావు ఆ ఆటవస్తువు. దానితో ఆడకు. దాన్ని అలాగే జాగ్రత్తగా అలమరాలో దాచుకో. పగిలిపోతే మళ్లీ కొనమంటావు...!'
'ఏమిటా నవ్వులు.. మరీ అంత పగలపడి, విరగబడి నవ్వాలా..? పొందిగ్గా ఉండలేవ్...!'
'ఒక్క దెబ్బ వేయగానే ఇల్లు ఎగిరిపోయేలా ఆ ఏడుపు ఏమిటి..? ఏడుపు ఆపకపోతే ఇంకో రెండు పడతాయి..!'
'నువ్వసలు చదవడం లేదుగానీ.. టీవీ కనెక్షన్ తీసేస్తా..!'
'ఎప్పుడూ వాళ్లు ఫస్టు రావడమేగానీ.. మనం ఫస్టుమార్కులు తెచ్చుకుందామని లేదే..!'
'నువ్వు ఈ జన్మకు పాసవ్వు..! నీకస్సలు చదువురాదు.. నాకు తెలుసుగా..?'