Social Icons

Wednesday, November 28, 2012

2012 డిసెంబర్ 21 యుగాంతమా? - [Doomsday 2012]

డిసెంబర్ 21, 2012, డూమ్స్ డే లేదా యుగాంతం గా పిలువ బడుతోంది. యుగాంతం గురించి ఎన్నో కథనాలు, మరెన్నో ఆసక్తికర విషయాలు పుకార్లుగా షికార్లు చేస్తున్నాయి.

1. శాస్త్రజ్ఞుల అంచనా
ఈ రోజున మొత్తం తొమ్మిది గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వస్తాయి. అందువలన వివిధ గ్రహాల ఆకర్షణ, వికర్షణ ల ఫలితంగా భూగోళం అల్లకల్లొలం అవుతుందని పరిశోధకుల కధనం. ఈ పరిణామంతో భూమి మీద ఏ ప్రాణీ బ్రతికి ఉండే అవకాశం ఉండదని ఒక కధనం.


2. కాల జ్ఞానుల అంచనా
  • దక్షిణ అమెరికాలో నివసించే 'మాయా' తెగల పంచాంగం ప్రకారం డిసెంబర్ 21, 2012 ప్రపంచానికి ఆఖరి రోజు.  ప్రస్తుతం మనం అనుసరిస్తున్న అనేక క్యాలెండర్లన్నింటికంటే కూడా తొంభై శాతం వాస్తవానికి దగ్గరగా భవిష్యత్తును చెప్పిన క్యాలెండర్‌ మాయ.
  • ప్రముఖ భవిష్యత్ దార్శనికుడు నోష్ట్రడామస్ కూడా ఈ విషయాలను ధ్రువీకరిస్తున్నాడు.
  • శ్రీ పోతులూరి వీరిబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో యుగాంతం గురించి చెప్పారు.

3.మతగ్రంధాలు ఏం చెబుతున్నాయి?
పరిశుద్ధ గ్రంధం (బైబిల్) క్రొత్త నిబంధన - ప్రకటన గ్రంధంలో యుగాంతం 7 దశలుగా జరుగబోతున్నట్లు చెప్పబడింది. మంచికి, చెడుకు మధ్య అంతిమ యుద్ధం జరుగుతుందని బైబిల్‌లో పేర్కొన్నారు. చివరకు దేవుడే భూ భ్రమణానికి స్టాప్‌ బటన్‌ నొక్కుతాడని బైబిల్‌ అంటోంది.

అంతా పచ్చి అబద్ధం ప్రళయం రాదు... అబ్దుల్ కలాం (శాస్త్రవేత్త,మాజీ రాస్ట్రపతి)

2012 లో ప్రళయం ప్రళయం వస్తుందనే మాటలో ఏ మాత్రం నిజంలేదని శాస్త్రవేత్త,మాజీ రాస్ట్రపతి అబ్దుల్ కలాం స్పస్టంగా చెప్పారు.2012లో విశ్వంలో కొన్ని మార్పులు జరగవచ్చు కాని ప్రళయం వచ్చేంతకావని ఆయన అన్నారు.ఇది కేవలం కొందరు వ్యక్తులు చేస్తున్నభూటక ప్రచారం మాత్రమేనని వ్యాఖ్యానించారు.(సాక్షి దినపత్రిక 27-11-2009).

అయితే ఇప్పటికే ఇలాంటి ప్రకటనలు చాలానే వచ్చాయి. ఏది జరిగినా భగవంతునిపై భారం వేసి మన జీవన ప్రయాణం కొనసాగించక తప్పదు మరి. అంతా మంచే జరగాలని, అందరూ హాయిగా ఉండాలని కోరుకుందాం.